ఆత్మహత్య చేస్కున్న ప్రముఖ బుల్లితెర నటి.!

ఈ లాక్ డౌన్ సమయంలోనే మన దేశంలో అనేక ఇండస్ట్రీలలో సినీ మరియు బుల్లితెర నటులు ఆత్మహత్యా గావించుకున్న ఘటనలు ఎక్కువగా వినిపించాయి. కారణాలు ఏమైనప్పటికీ మాత్రం ఈ మధ్య కాలంలోనే చాలా వరకు ఇలాంటి విషాద వార్తలు వినడం బాధాకరం. అలా ఇప్పుడు మన తెలుగు బుల్లితెరకు చెందిన ప్రముఖ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన బయటకొచ్చింది. ఆమె ఈటీవీ మరియు స్టార్ మా ఛానెల్లలో “మనసు మమత”, “మౌనరాగం” ధారావాహికలలో నటిస్తున్న శ్రావణి.

ఇక అసలు వివరాల్లోకి వెళితే శ్రావణి ముందుగా టిక్ టాక్ నుంచి పాపులర్ అయితే ఆమెకు అప్పటి నుంచే కాకినాడకు చెందిన దేవరాజు రెడ్డి అనే వ్యక్తి అనాథగా పరిచయం అయ్యాడు. దానితో ఆమె సింపతీతో బాగానే మాట్లాడేది కానీ అతడు మెల్లగా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీనితో ఆమె తన వేధింపులు తాళలేక నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ మధురానగర్ లో ఆమె నివాసంలోనే ఆత్మహత్య చేసుకుంది. దీనితో అతనిపై ఆమె తల్లిదండ్రులు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

Exit mobile version