‘ఇద్దరు’ సినిమాలో ‘వెన్నెల వెన్నెలా’ అన్నా, ‘చందమామ’ సినిమాలో ‘నాలో ఊహలకు నాలో ఊసులకు’ అన్నా గుర్తు వచ్చే పేరు ఏకైక పేరు ఆశా భోస్లే. తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అశా భోస్లేకి ఇండియాలోనే ఫేమస్ ప్లే బ్యాక్ సింగర్ గా పేరుంది. ఆశా భోస్లే రెండవ కూమార్తె అయిన వర్ష భోస్లే ఈ రోజు తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. వర్ష భోస్లే సౌత్ ముంబైలోని పెద్దార్ రోడ్లో నివసిస్తుంటారు. ఆమె తన స్వగృహంలో తన దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నారని ఆ ప్రాంత పోలీస్ అధికారి తెలియజేసారు. ఆమె ఇంటికి దగ్గర ఉన్న ఓ హాస్పిటల్ వారు ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు. 56 సంవత్సరాలు గల వర్ష భోస్లే హిందీ మరియు మరాఠి భాషల్లో పాటలు పాడారు అంతే కాకుండా ఆమె మాగజైన్ లకు మరియు పత్రికలకు ఆర్టికల్స్ కూడా రాస్తారు. వర్ష భోస్లే ఇదివరకే 2008 మరియు 2010 లలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఏమిటా అని ఆరా తీస్తున్నారు.