సినిమా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫ్యామిలీ షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేష్, మహేష్ బాబు, సమంతా, ప్రకాష్ రాజ్, జయసుధ లపై ‘ఆరు అడుగుల అధగాడు వస్తాడే’ అనే పాట చిత్రీకరిస్తున్నారు. మార్చి 3 వరకు ఈ షెడ్యుల్ కొనసాగుతుంది. ఆ తరువాత హైదరాబాద్ తిరిగి వస్తారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అటు వెంకటేష్ అభిమానులు మరియు ఇటు మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నారు. మల్టి స్టారర్ చిత్రాలకు ఇది ట్రెండ్ సెట్టర్ గా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.