యంగ్ టైగర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్రం పై బాగా పాజిటివ్ టాక్ ఉండటంతో విడుదలకు ముందే ఈ చిత్రం భారీ బిజినెస్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తుంది. మాకు లభించిన సమాచారం ప్రకారం ఈ చిత్ర సాటిలైట్ హక్కులు జీ తెలుగు వారు 6 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ చిత్ర హక్కుల కోసం జీ తెలుగుతో పాటు మరో చానల్ కూడా పోటీ పడటంతో జీ తెలుగు వారు భారీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిషా మరియు కార్తీక నటిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్ఎమ్ కీరవాణి అందించిన ఈ చిత్ర ఆడియో నందమూరి అభిమానుల సమక్షంలో త్వరలో విడుదల చేయబోతున్నారు.