ప్రత్యేకం : ఫ్యాన్స్ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర ఆడియో ఈ నెల 24న అభిమానుల మధ్య విడుదల కావాల్సి ఉండగా ఆడియో వేడుకని కాన్సిల్ చేసారు. అయితే ఈ వేడుకను ఎందుకు రద్దు చేసారని ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే ఈ వేడుక రద్దు కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని. గతంలో పంజా, గబ్బర్ సింగ్ సినిమాలకి ఆడియో వేడుకలు చేయగా పవన్ అభిమానులు వేలాదిగా వచ్చారు. అనుకున్న దాని కంటె అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అంత మందిని అదుపు చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చాలా మంది అభిమానులు వేడుకను చూడకుండానే వెనుతిరిగారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న పవన్ ఆడియో వేడుకలు అభిమానుల కోసమే చేస్తాము. వాళ్ళే చూడలేకపోతున్నప్పుడు ఈ వేడుకలు చేసుకోవడం ఎందుకని సున్నితంగా వద్దన్నట్లు సమాచారం. పవన్ తన అభిమానుల కోసం ఆలోచించడం ఇంతల ఆలోచించడం చూస్తే పవన్ అంటే అయన అభిమానులు ఆయనంటే ఎందుకు పడి చస్తారో అర్ధమవుతుంది.

Exit mobile version