ప్రత్యేకం : ఆగష్టు నుండి నాగార్జున – వీరభద్రమ్ ‘భాయ్’

ప్రత్యేకం : ఆగష్టు నుండి నాగార్జున – వీరభద్రమ్ ‘భాయ్’

Published on Mar 15, 2012 11:25 AM IST


సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ త్వరలో కింగ్ అక్కినేని నాగార్జునని డైరెక్ట్ చేయబోతున్నాడు. మాఫియా థ్రిల్లర్ నేపధ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగష్టు నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఖరారైన ఈ చిత్రాన్ని ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మించనున్నారు. ఇటీవలే ‘పూలరంగడు’తో భారీ విజయం అందుకున్న దర్శకుడు వీరభద్రమ్ కి ఇది డ్రీం ప్రాజెక్ట్. ఈ చిత్రం గురుంచి ఆయనను అడగగా చిత్రం ఖరారైనట్లు ఆయన ధ్రువీకరించారు. ప్రస్తుతం నాగార్జున శిరిడి సాయి చిత్ర షూటింగ్లో బిజీగున్నారు. అలాగే డమరుఖం కూడా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

తాజా వార్తలు