ప్రత్యేకం : బన్ని సినిమా నుండి రిచా అవుట్

ప్రత్యేకం : బన్ని సినిమా నుండి రిచా అవుట్

Published on Nov 1, 2012 2:40 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకి సంబందించిన ఒక ప్రత్యేకమైన వార్తని మీకు అందిస్తున్నాము. ఈ సినిమాలో మొదట్లో బన్ని సరసన అమలా పాల్ మరియు రిచా గంగోపాధ్యాయలను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అధికారికంగా రిచా స్థానంలో తాప్సీ ఎంపికయ్యారు. ఈ మార్పుకి గల కారణం ఏమిటా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో బన్ని సరసన అమలా పాల్ మరియు తాప్సీ ఆడిపాడనున్నారు. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదట అనుకున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ స్పెయిన్ కూడా మారిపోయింది. రిచా అభిమానులు తను అల్లు అర్జున్ సరసన నటిస్తే చూడటానికి ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు