ప్రత్యేకం : నైజాంలో మొదటి వారం కలెక్షన్లలో కొత్త రికార్డు సృష్టించిన గబ్బర్ సింగ్

ప్రత్యేకం : నైజాంలో మొదటి వారం కలెక్షన్లలో కొత్త రికార్డు సృష్టించిన గబ్బర్ సింగ్

Published on May 18, 2012 10:12 AM IST


గబ్బర్ సింగ్ నైజాం ఏరియాలో మొదటి వారం కలెక్షన్లలో రికార్డు సృష్టించాడు. ఈ చిత్రం నైజాం ఏరియాకు గాను మొదటి వారం రోజుల్లోనే 9.23 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల సునామి సృష్టించిన గబ్బర్ సింగ్ మిగతా ఏరియాల్లో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వివరాలు కూడా అందిన వెంటనే అప్డేట్ చేస్తాము. ఈ చిత్ర భారీ విజయంతో పవన్ కళ్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో పూరి జగన్నాధ్ తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి రెడీ అవుతున్నాడు.

తాజా వార్తలు