ఈగ సీక్వెల్ ఆలోచనలో ఎస్ ఎస్ రాజమౌళి బృందం


“ఈగ” భారీ విజయం సాదించిన తరువాత ఈ చిత్ర నిర్మాతలు మరియు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్య జరిగిన చర్చల్లో ఈ విషయమై పలు అంశాలను చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ ఆలోచన ఇంకా మొదటి దశలోనే ఉన్న డి సురేష్ బాబు మరియు సాయి కొర్రపాటి ఇద్దరు ఈ విషయమై ఆసక్తికరంగా ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఈగ చిత్రాన్ని 3Dలో విడుదల చేశాక రాజమౌళి ఏ చిత్రం చెయ్యాలని ఆలోచనలో ఉన్నారు. “ఈగ 2” చిత్రాన్ని చేస్తారా లేదా అనేది ఆసక్తికరమయిన విషయం. ప్రస్తుతానికి “ఈగ 2” చిత్రం అనగానే సిని అభిమానుల్లో ఉత్సాహం నిండిపోతుంది మీరేమంటారు?

Exit mobile version