ప్రత్యేక ఇంటర్వ్యూ : రేజీనా – మహేష్ బాబు సరసన నటించాలన్నది నా కల..


చాలా కాలం క్రితం బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ (ఈ షార్ట్ ఫిల్మ్ నే సిద్దార్థ్ హీరోగా ‘లవ్ ఫెయిల్యూర్’ అని నిర్మించారు) ద్వారా పరిచయమైన నటి రెజీనా. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘ఎస్.ఎం.ఎస్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వస్తున్న ‘రొటీన్ లవ్ స్టొరీ’తో రెజీనా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రెజీనా మాతో పంచుకున్న విశేషాలు మీ కోసం అందిస్తున్నాం…

ప్రశ్న) ఇప్పుడొస్తున్న మిగతా లవ్ స్టొరీలకీ మీ రొటీన్ లవ్ స్టొరీకి ఉన్న తేడా ఏమిటి?
స) రొటీన్ లవ్ స్టొరీ అంటే క్యాచీగా ఉంటూ సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మేము ఈ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరికీ వారి యంగ్ ఏజ్ లో ఎక్కడో ఓ చోట జరిగుంటుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు పోషించిన పాత్ర పేరేమిటి?
స) ఈ సినిమాలో నా పాత్ర పేరు తన్వి. బాగా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి మరియు వారి కుటుంబ సభ్యులు అడిగే కోరికలు విలువనిస్తుంది, అలాగే ఎంతో అణకువగా ఉండే పాత్ర.

ప్రశ్న) చూడటానికి ఈ సినిమాలో పాత్ర, మీ మునుపటి సినిమా ‘ఎస్.ఎం.ఎస్’ లో లానే ఉంది?
స) అలా లేదండీ. ఎస్.ఎం.ఎస్ సినిమాలో నా పాత్రలో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్రకి అంత మెచ్యూరిటీ ఉండదు మరియు అన్నింటికీ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాను. అలాగే ఈ సినిమాలో చేసిన డేటింగ్ సీన్స్ ఎస్.ఎం.ఎస్ మూవీలో లేవు.

ప్రశ్న) ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో బాధాకరమైన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా?
స) అది బాధాకరమైన ఆనుభవం కాదు, కానీ ఒక అనుభవం ఉంది. హృషికేశ్ లో ఒక చిన్న పడవలో నేను, సందీప్ వెళుతుండగా పడవలోనుంచి పడిపోతాము. అది కొంచెం భయంగా అనిపించింది కానీ నేను ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడాలి. ఆ అనుభవం భయం కంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.

ప్రశ్న) మీరు తెలుగు మరియు తమిళ పరిశ్రమలో పని చేసారు. ఈ రెండు సినీ ఇండస్ట్రీలలో మీకు కనిపించిన పెద్ద తేడాలు ఏమిటి?
స) ఒక్క భాష విషయంలో తప్ప మిగాతా అన్ని విషయాల్లోనూ రెండు ఇండస్ట్రీలు ఒకేలా ఉన్నాయి మరియు పనిచేసే విధానం కూడా ఒకేలా ఉంటుంది. కొన్ని తమిళ సినిమాలు టైటిల్ కి తగ్గట్టుగా రియాలిటీకి దగ్గరగా మరియు గ్లామర్ అనేదే లేకుండా ఉంటాయి. తెలుగు సినిమాల్లో హీరోయిజం, అందమైన ప్రదేశాలు, భారీ బడ్జెట్ మొదలైనవి ఉంటాయి.

ప్రశ్న) డైరెక్టర్ ప్రవీణ్ తో పని చెయ్యడం ఎలా అనిపించింది?
స) మిగతా దర్శకులతో పోల్చుకుంటే ప్రవీణ్ మాత్రం డిఫరెంట్. ఆయన ఎక్కువ భాగం రియాలిటీకి ప్రాముఖ్యతను ఇచ్చి ఈ కథను సిద్దం చేసుకున్నారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది. పూర్తి సహజత్వానికి దగ్గరగా ప్రవీణ్ తెరకెక్కించారు.

ప్రశ్న) మీరు తెలుగులో చేయనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
స) ప్రస్తుతం చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ నేను ఇంకా దేనికీ యాక్సెప్ట్ చేయలేదు. ప్రస్తుతానికి నేషనల్ అవార్డు గెలుచుకున్న పాండీరాజ్ డైరెక్షన్లో ఒక తమిళ సినిమాలో చేస్తున్నాను.

ప్రశ్న) తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు?
స) తెలుగులో చాలా మంది నచ్చిన హీరోలు ఉన్నారు. వారందరిలో నుంచి ఒకరిని చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది సూపర్ స్టార్ మహేష్ బాబు. అతనితో ఓ సినిమా చేయాలనుకున్న నా కల ఎప్పుడు నెరవేరుతుందో ఏమో.

ప్రశ్న) మీ రోల్ మోడల్స్ ఎవరు?
స) నాకు హీత్ లెడ్జర్ అంటే చాలా ఇష్టం. అలాగే తమిళంలో సూర్య అన్నా నాకు చాలా ఇష్టం.

ప్రశ్న) మీరు హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు?
స) నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే మొదటిసారి నటించాను. ఆ తర్వాత ‘సూర్యకాంతి’ అనే ఓ కన్నడ సినిమాలో నటించాను. అది చేసిన తర్వాత తమిళంలో వచ్చిన ఒక ఫేమస్ షార్ట్ ఫిల్మ్ లో నటించాను దాన్నే సిద్దార్థ్ హీరోగా ‘లవ్ ఫెయిల్యూర్’ అనే టైటిల్ తో నిర్మించారు.

ప్రశ్న) మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కొంచెం చెబుతారా?
స) మా నాన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి, అమ్మ టీచర్. మా అమ్మ నాన్నలకి ఏకైక సంతానం నేనే. మా తల్లితండ్రులు నా చదువు విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తేనే హీరోయిన్ అవ్వడానికి ఆమోదిస్తామని అన్నారు.

ప్రశ్న) ఈ రొటీన్ లవ్ స్టొరీ సినిమా నుండి మీరేమి ఆశిస్తున్నారు?
స) ఈ సినిమా చాలా మంచి ఎంటర్ టైనర్, సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేసాను మరియు అందరూ ఎంజాయ్ చేసే పాత్రలు సినిమాలో ఉన్నాయి. సందీప్ కిషన్ నటన కూడా చాలా బాగుంటుంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

రేజీనాకి అల్ ది బెస్ట్ చెప్పి, ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ని ముగించాము.

Exit mobile version