మెగా అభిమానులకి శుభ వార్త! గత కొద్ది రోజులుగా మెగా కుటుంభంలో మనస్పర్ధలు అంటూ వస్తున్న పుకార్లకు త్వరలో తెరదించనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల వేడుకకి మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి హాజరు కానున్నారు. ఏప్రిల్ 15న విడుదల కానున్న ఈ ఆడియో వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాత గణేష్ బాబు ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేసి మొదటగా తిరుపతి వెళ్లి అక్కడ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుని అటు నుండి విశాఖపట్నం వెళ్లి అక్కడ ఒక పాట విడుదల చేసి తిరిగి హైదరాబద్ చేరుకొని ఘనంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆడియో విడుదల చేయనున్నారు.