ప్రత్యేకం : త్రివిక్రమ్ సినిమాకి డబ్బింగ్ చెబుతున్న బన్నీ

ప్రత్యేకం : త్రివిక్రమ్ సినిమాకి డబ్బింగ్ చెబుతున్న బన్నీ

Published on Mar 15, 2012 5:50 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రముఖ డబ్బింగ్ థియేటర్ శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో తను పోషించిన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడు. ఇలియానా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు