ప్రత్యేకం : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న బాద్షా


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’ చిత్రానికి సంబందించిన ఒక ప్రత్యేకమైన సమాచారం మాకు అందింది. ‘బాద్షా’ చిత్రాన్ని ముందుగా 2013 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీనికి గల కారణం ఏమిటంటే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను ఎంతో స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం విదేశీ స్టంట్ మాస్టర్లు యాక్షన్ సన్నివేశాలు కంపోస్ చేస్తున్నారు, అలాగే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం కూడా సినిమా చాలా రిచ్ గా మరియు క్లాస్ గా ఉండాలని ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు.

ఈ కారణాల వల్ల సంక్రాంతి లోపు ‘బాద్షా’ చిత్ర చిత్రీకరణ పూర్తి కాదని సినిమా విడుదల వాయిదా వేశారు. సినిమా అనుకున్న టైంకి పూర్తవడం కంటే హై క్వాలిటీ సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాత బండ్ల గణేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో కామెడీ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్ర టీం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కలిసి బాక్స్ ఆఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టాలని నిర్ణయించుకున్నారు, అందుకనే ఈ చిత్రం కోసం ఎంతో కష్ట పడుతున్నారు.

Exit mobile version