ప్రత్యేకం : ఆటో నగర్ సూర్య నవంబర్ రెండో వారంలో రాబోతున్నాడా?

ప్రత్యేకం : ఆటో నగర్ సూర్య నవంబర్ రెండో వారంలో రాబోతున్నాడా?

Published on Sep 11, 2012 10:42 AM IST


దడ, బెజవాడ సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘ఆటో నగర్ సూర్య’ సినిమా ఎలాగైనా హిట్ చేయాలన్న కసితో ఉన్నాడు నాగ చైతన్య. దాదాపు సంవత్సరం పైగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నాగ చైతన్య సూర్య అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకి జోడీగా సమంతా మరోసారి రొమాన్స్ చేయబోతుంది. విమర్శకులు మెచ్చే దర్శకుడు దేవకట్టా రూపొందిస్తున్న ఈ సినిమాని మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు