పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ సైఫై కం మైథలాజి డ్రామా “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రానికి కూడా మేకర్స్ సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అవైటెడ్ సీక్వెల్ పై దర్శకుడు లేటెస్ట్ గా ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
మరి ప్రస్తుతం ఈ సినిమా తాలుకా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది అని ఒక్కసారి ప్రభాస్ సినిమా కోసం సిద్ధం అయితే సినిమా పూర్తి చేస్తామని కన్ఫర్మ్ చేసాడు. అలాగే రిలీజ్ పై కూడా సాలిడ్ క్లారిటీ తాను అందించారు. ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్ లో అలా విడుదలకి తీసుకొచ్చే సన్నాహాలు ఉన్నట్టుగా తెలిపారు.
దీనితో కల్కి 2 రాకకు అన్నీ సెట్టయితే ఎంతో సమయం తీసుకోకండానే వచ్చేస్తుంది అని చెప్పాలి. ఇక ప్రభాస్ నుంచి షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఒక్కటి రావడం బాకీ అని చెప్పాలి. అలాగే ఆల్రెడీ ప్రభాస్ లేని సీన్స్ షూటింగ్ సెట్టింగ్స్ ఇతర వర్క్ చాలానే పూర్తి చేశారు సో ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.