నైజాంలోనూ ‘కుబేర’ కలెక్షన్ల సంచలనం !

నైజాంలోనూ ‘కుబేర’ కలెక్షన్ల సంచలనం !

Published on Jun 22, 2025 11:00 AM IST

ధనుష్ – నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ ఈ సినిమా సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. రోజురోజుకు ఈ చిత్రం అనూహ్యంగా మంచి కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం వసూళ్ల సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ల డీటెయిల్స్ బయటకు వచ్చాయి. నైజాం ఏరియాలో ‘కుబేర’ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది.

ఈ చిత్రం నైజాం ప్రాంతంలో మొదటి రోజు రూ. 2.7 కోట్ల (జీఎస్టీ తో సహా) షేర్ ను సాధించింది. విశేషమేమిటంటే, రెండవ రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి, రూ. 3.2 కోట్ల ( జీఎస్టీ తో సహా) షేర్ తో, మొత్తం రెండు రోజులకు గానూ రూ. 5.9 కోట్లను (జీఎస్టీతో సహా) రాబట్టింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నైజాంలో కుబేరకు మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఈ రోజు ఆదివారం కాబట్టి, కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు