ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 1, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : యశ్వంత్ పెండ్యాల, విస్మయ శ్రీ, మరియు లేఖ్య తదితరులు.
దర్శకుడు : శ్రీకాంత్ దేవరకొండ
నిర్మాత : ఈనాడు ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం : బీవీ హర్ష
సినిమాటోగ్రాఫర్స్ : మౌర్య ఇల
ఎడిటింగ్ : ఎస్ జె శివ కిరణ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రతీ వారం కొత్త ఎపిసోడ్స్ తో అలరిస్తున్న కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నే అమృతవల్లి. మరి ఈ వీక్లీ సిరీస్ లో ఈ కొత్త ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
లైఫ్ లో బాగానే సెటిల్ అయిన ఉద్యోగస్తుడు శరత్ (యశ్వంత్ పెండ్యాల) తన తల్లిదండ్రులు కుదిర్చిన ఒక గొప్పింటి పెళ్లి సంబంధం అమ్మాయి దివ్య (లేఖ్య అదురై) ని పెళ్లి చూపులు చూడటానికి వెళ్తాడు. అయితే ఆమె అతనికి బాగానే అనిపిస్తుంది కానీ మనసుకి నచ్చదు. అలానే పెళ్ళికి ఓకే అంటాడు. ఇలా పెళ్లి చూపులు తర్వాత తన కార్ బ్రేక్ డౌన్ కావడంతో మధ్యలో ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ అమృతవల్లి (విస్మయ శ్రీ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన అభిరుచులకు దగ్గరగా ఉన్న అమ్మాయి కావడంతో శరత్ కొంచెం ఆకర్షితుడు అవుతాడు. మరి అక్కడ నుంచి ఆమె కోసం ఏం తెలుసుకున్నాడు? ఆమె గతం ఏంటి? శరత్.. దివ్య, అమృతవల్లి లలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ కూడా దాదాపు అరగంట మాత్రమే ఉంటుంది. అయితే ఈ అరగంటలో కూడా మొదటి పద్నాలుగు నిమిషాల మేర కథనం మాత్రం బ్యూటిఫుల్ గా సాగింది అని చెప్పాలి. కథానాయకుడు పెళ్లి చూపులు నుంచి అమృతవల్లి పాత్ర పరిచయం ఆమె గతాన్ని చెప్పడానికి ముందు వరకు కథనంని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు.
ఒకో ప్రశ్నకి సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తూ నడిపించిన కథనం ఈ 14 నిమిషాలలో ఆకట్టుకుంటుంది. ఇక ముగ్గురు లీడ్ నటీనటులు బాగా చేశారు. యశ్వంత్ పెండ్యాల, లేఖ్యలు డీసెంట్ పెర్ఫామెన్స్ లు అందించారు, కానీ హైలైట్ మాత్రం అమృతవల్లి నటి విస్మయ శ్రీ అని చెప్పడంలో సందేహం లేదు. తాను ఆ పాత్రకు బాగా సెట్ అయ్యింది. అంతే చక్కగా, అందంగా కూడా కనిపించి మంచి నటన కనబరిచింది.
మైనస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ లో ఆరంభం నుంచి దాదాపు సగం వరకు కథనం బాగానే అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే అమృతవల్లి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుందో అక్కడ నుంచి అంత ఇంట్రెస్ట్ గా ఏమీ అనిపించదు.
చాలా రొటీన్ గా ఆమె ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. మరో రకమైన బలమైన ఎమోషన్స్ తో కూడిన గతాన్ని దర్శకుడు ఆమెకి డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే హీరో పాత్ర కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది.
కొన్ని కొన్ని సీన్స్ లో తన పాత్ర ఓవర్ డ్రమాటిక్ గా ప్రవర్తించడం అంత నాచురల్ గా అనిపించదు. ఇలా ప్రథమార్ధం బాగానే అనిపించినప్పటికీ మిగతా సగం మాత్రం పేలవంగా అనిపిస్తుంది. మరి దీనిని కూడా బాగా తెరకెక్కించి ఉంటే పరిపూర్ణంగా అనిపించేది.
సాంకేతిక వర్గం:
ఈ ఎపిసోడ్ లో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. బీవీ హర్ష ఇచ్చిన సంగీతం బాగుంది. అలాగే మౌర్య ఇల ఇచ్చిన విజువల్స్ కూడా బాగున్నాయి. అయితే ఎస్ జె కిరణ్ ఎడిటింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ విషయానికి వస్తే.. తాను మొదటి సగం కథనం బాగానే నడిపించారు. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ మెయిన్ పాయింట్ లో సరైన డెప్త్ ని తాను మైంటైన్ చేయలేదు. ఇంకా బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని హీరో పాత్రని బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. సో వీటితో తన వర్క్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘అమృతవల్లి’ కొంచెం ఇష్టంగా అనిపిస్తే ఇంకొంచెం కష్టంగా అనిపిస్తుంది. మెయిన్ హైలైట్ విస్మయ అని చెప్పవచ్చు. అలాగే మొదటి సగం బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం పేలవంగా ఉంది. కేవలం ఆ మొదటి సగం వరకు చూడాలి అనుకుంటే ఓకే కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఈ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team