ఎర్రచీర: A సర్టిఫికేట్‌తో అక్టోబర్ 24న గ్రాండ్ రిలీజ్

ఎర్రచీర: A సర్టిఫికేట్‌తో అక్టోబర్ 24న గ్రాండ్ రిలీజ్

Published on Oct 9, 2025 10:00 AM IST

Erracheera

బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. ఈ చిత్రంలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని హీరోయిన్‌గా నటించింది. సుమన్ బాబు స్వయంగా దర్శకత్వం వహించడం తో పాటు ఒక కీలక పాత్రలో కూడా నటించారు.

మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల, సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. హార్ట్ పేషెంట్స్ థియేటర్‌కు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు సుమన్ బాబు సూచించారు.

నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.వి. సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ: “మా సినిమా కంటెంట్‌కు ఒక ధార్మిక స్పర్శ ఉంది. అందుకే కార్తీక మాసం సందర్బంగా అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లు ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు