ఈ ఆగస్ట్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ ఏదన్నా ఉంది అంటే అది వార్ 2 మరియు కూలీ సినిమాల క్లాష్ అనే చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ లతో కూలీ, రజినీ, నాగ్ అలాగే అమీర్ లాంటి స్టార్స్ కూలీలో ఉండగా ఈ ఎపిక్ క్లాష్ పట్ల మంచి ఆసక్తి నెలకొంది.
అయితే సౌత్ సహా సౌత్ లో రెండు సినిమాల నడుమ థియేటర్స్ పరంగా గట్టి పోటీ ఉండనుంది. కానీ నార్త్ లో మాత్రం ఒకింత వార్ 2 కే ఎక్కువ స్క్రీన్స్ దక్కొచ్చు అనుకోవచ్చు కానీ నార్త్ లో కూడా వార్ 2 కి కూలీ పెద్ద పోటీనే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే కూలీ ఓటిటి డీల్ 8 వారాల తర్వాతే లాక్ కావడంతో హిందీ మార్కెట్ లో నేషనల్ చైన్స్ ఇంకా అనేక సింగిల్ స్క్రీన్స్ వారు కూడా కూలీకి మొగ్గు చూపిస్తున్నారట. దీనితో హిందీలో కూడా కూలీ కి భారీ రిలీజ్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో అమీర్ ఖాన్ రోల్ ఏమాత్రం వర్కౌట్ అయినా నార్త్ లో మరింత రెస్పాన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.