ఆయనగారి గుర్రం అమెరికాలో ఎగురబోతుందట

ఆయనగారి గుర్రం అమెరికాలో ఎగురబోతుందట

Published on Apr 19, 2013 9:05 PM IST
First Posted at 01.55 on Apr 20th

Emo-Gurram-Eguravachu

సుమంత్, పింకీ సావికలు నటిస్తున్న ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా టాకీ భాగం ఇప్పటికే హైదరాబాద్లో పూర్తి చేసుకున్న రెండు షెడ్యూల్ల ద్వారా 50శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 25 నుండి అమరికాలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ ఒక నెలపాటు సాగుతుంది. చంద్ర సిద్ధార్ద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పి. మదన్ కుమార్ నిర్మాత.

ఈ సినిమా గురించి చంద్ర సిద్ధార్ధ్ మాట్లాడుతూ ” ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ కధ ఒక మోడరన్ యువతికి, పల్లెటూరు అబ్బాయికి మధ్య సాగే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ కధను ఎస్.ఎస్ కాంచి అందించాడు. అతనే దర్శకత్వం వహించాలనుకున్నాడు. కానీ మా కోరిక మేరకు ఆ స్క్రిప్ట్ ను మాకు అందించాడు. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ” అని అన్నారు. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న సుమంత్ ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. పింకీ సావిక థాయిలాండ్లో ఒక ప్రముఖ టి.వి తార. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయంకానుంది.

తాజా వార్తలు