బ్యాంకాక్లో ఎగురుతున్న గుర్రం

బ్యాంకాక్లో ఎగురుతున్న గుర్రం

Published on May 15, 2013 8:32 AM IST

Emo-Gurram-Eguravachu
సుమంత్, పింకీ సవిక హరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. ఎస్.ఎస్ రాజమౌళి దగ్గర స్క్రిప్ట్ డాక్టర్ గా పనిచేసే ఎస్.ఎస్ కంచి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని అందించారు. చంద్ర సిద్దార్థ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పి. మదన్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి చంద్ర సిద్దార్థ్ చెబుతూ ఈ సినిమాకి మ్యూజిక్ మెయిన్ హైలైట్ అవుతునదని అన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పింకీ సవిక థాయ్ కి చెందిన హీరోయిన్, ఈ సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ సినిమాని యుఎస్ లో షూట్ చేయనున్నారు.

తాజా వార్తలు