“ఈగ” చిత్ర ఆడియో విడుదల వాయిదా

“ఈగ” చిత్ర ఆడియో విడుదల వాయిదా

Published on Mar 8, 2012 9:00 PM IST

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్రాఫిక్ మాయాజాలం “ఈగ” చిత్ర ఆడియో ఒక వారం వాయిదా పడింది గతం లో ఈ చిత్ర ఆడియో ఈ నెల 22 న విడుదల చేయ్యనున్నట్టు ప్రకటించగా ప్రస్తుతం మార్చ్ 30 కి వాయిదా వేశారు. ఈ వాయిదా కి కారణం ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలకు చెయ్యాల్సిన గ్రాఫిక్స్ ఆలస్యం కావటమే అని అంటున్నారు. గతం లో ఈ చిత్రం ఏప్రిల్ 5 న విడుదల అవుతుందని రాజమౌళి ప్రకటించారు కాని ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్ 7 న విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.నాని ,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే అన్ని చోట్ల మంచి బిజినెస్ చేస్తుంది ఈ విషయం డిస్ట్రిబ్యుటర్ లకు రాజమౌళి మీద ఉన్న నమ్మకాన్ని తెలుపుతుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళం లో ఒకేసారి విడుదల కానుంది.

తాజా వార్తలు