కేన్స్ లో ప్రదర్శించనున్న’ఈగ’

Eega New Posters (3)

ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ ఎఫెక్ట్స్ తో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్మించిన సినిమా ‘ఈగ’. ఈ సినిమాని కేన్స్ లో మార్చే డు సినిమా(సినిమా మార్కెట్) లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ‘ఈగ’ టీంలోని కొంతమంది వెళ్ళనున్నారు. ఈ వీరితో పాటు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళనున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్ట్ వెల్ కి మేము వెళ్తున్నాము. మొదటి సారిగా ఏదైనా ఫెస్ట్ వెల్ కి వెళుతున్నపుడు ఎలా ఉంటుందో అన్న కుతూహలం ఉంటుంది. ఈ నెల 20వ తేదిన ‘ఈగ’ ని స్క్రీన్ పై ప్రదర్శించబోతున్నాము’ అని శోబు ట్విట్ చేశారు.
ఈ ఇంటర్నేషినల్ ఫిలిం ఫెస్ట్ వెల్ లో ‘ఈగ’ సినిమాని ప్రదర్శించిన తరువాత ఈ టీం ‘బాహుబలి’ అంశాలను కూడా అక్కడ చర్చించనున్నారని సమాచారం. మార్చే డు సినిమా వారు ‘ఈగ’ సినిమాని ఈ నెల 20న స్క్రీన్ పై ప్రదర్శించనున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి గారికి మరొక సారి మా తరుపున అభినందనలు తెలియజేస్తున్నాం

Exit mobile version