బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్న ఈగ

Eega-21
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’ సినిమా గత కొద్ది వారాలుగా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించబడుతోంది. ఇదిలా విదేశాల్లో ఎగురుతున్న ‘ఈగ’కి మరో ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఆహ్వానం అందింది. ఈ సంవత్సరం అక్టోబర్లో సౌత్ కొరియా బుసన్ లో జరగనున్న బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘ఈగ’ ని ప్రదర్శించనున్నారు. ఆసియాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ ఇది, అక్కడ ‘ఈగ’ సినిమా ప్రదర్శిస్తే ముఖ్యంగా చైనా, సౌత్ కొరియా, జపాన్, సౌత్ ఈస్ట్ ఆసియా లలో రాజమౌళికి ఖచ్చితంగా కొత్త మార్కెట్ పెరగడానికి దారి దొరికినట్లే. ఈ సంవత్సరం తర్వాత ఈగ సినిమా మాడ్రిడ్ ఫిల్మ్ ఫెస్టివల్, పుచోన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించనున్నారు.

Exit mobile version