ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన గ్రాఫికల్ మానియా ‘ఈగ’. ఈ చిత్రం యు.ఎస్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ యు.ఎస్ బాక్స్ ఆఫీసును కొల్లగొడుతోంది. ఈ కలెక్షన్ల వరద ఇలాగే ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లను అతి త్వరలోనే కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మొదటి షో నుంచి అన్ని ఎరియాల్లోను మంచి పాజిటివ్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. యు.ఎస్ లో విడుదలైన ఒక్కొక్క ఏరియా మొదటివారం యావరేజ్ కలెక్షన్ల విషయంలో ఇప్పటి వరకు అత్యదిక వసూళ్లు సాదించిన తెలుగు చిత్ర కలెక్షన్లను ‘ఈగ’ చిత్రం అధిగమించింది. ‘ఈగ’ చిత్రం ఇంకా ముందు ముందు ఎలాంటి అత్యున్నత శిఖరాలను చేరుకుంటుందో వేచి చూద్దాం.