ఆంధ్ర ప్రదేశ్లో మొదలైన ఈగ సందడి

ఆంధ్ర ప్రదేశ్లో మొదలైన ఈగ సందడి

Published on Jul 5, 2012 12:51 PM IST


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ రెట్టింపయ్యింది. ఈ చిత్ర టికెట్లు బుకింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే ఈ వారంతంలోని అన్ని రోజులకి టికెట్లు అయిపోయాయి. సినీ అభిమానులు మరియు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఒక చిన్న ఈగతో సినిమా ఎలా తీశారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఈ చిత్రాన్ని చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బహుశా చలన చిత్ర రంగంలో మొట్ట మొదట సారిగా ఒక అగ్ర హీరో లేకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కి అత్యధిక వసూళ్లు సాదించగలిగే ఘనత ఈ చిత్రానికే దక్కనుంది. ఈ చిత్రం ఘన విజం సాధిస్తే ఈ చిత్ర స్ఫూర్తితో చలన చిత్ర రంగంలో ఉన్న యంగ్ మూవీ మేకర్స్ కొత్త రకమైన చిత్రాలు తీయడానికి ముందుకొస్తారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల తీర్పు తెలియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్ర ఫలితం కోసం ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు