తమిళంలోనూ భారీ విజయం సాదించిన “ఈగ”

తమిళంలోనూ భారీ విజయం సాదించిన “ఈగ”

Published on Jul 28, 2012 11:30 AM IST


ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” తమిళ నాడులో భారీ విజయం సాదించింది. ఈ ద్విభాషా చిత్రం తమిళంలో “నాన్ ఈ” పేరుతో జూలై 6న విడుదల అయ్యింది. మొదట ఈ చిత్రం 200 థియేటర్లకు పైగా విడుదల చెయ్యగా వారం తరువాత బిల్లా-2 విడుదల కారణంగా థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం పలు స్క్రీన్లలో ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 185 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం ఎటువంటి పెద్ద తారలు లేకుండా అక్కడ 21 రోజుల్లో 18.22 కోట్ల గ్రాస్ ని సంపాదించింది. ఈ చిత్రంతో రాజమౌళి పేరు తమిళ నాడు అంతటా మారుమ్రోగిపోతుంది ఈ సమయాన్ని ఉపయోగించుకొని రాజమౌళి చిత్రం “చత్రపతి” చిత్రాన్ని “చంద్రమౌళి”గా అనువదిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్ వి పోట్లురి భారీ లాభాలు గడించారు.

తాజా వార్తలు