జూలై మొదటివారంలో ” ఈగ “

జూలై మొదటివారంలో ” ఈగ “

Published on May 31, 2012 2:07 AM IST


తెలుగు చలనచిత్ర రంగం లో తిరుగులేని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి నుంచి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న గ్రాఫిక్స్ మాయాజాలం ‘ ఈగ ‘ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజా సినీవర్గ సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై మొదటి వారం లో విడుదలుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు అలాగే విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎంతో గొప్పగా రావాలని కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యిందని కాని దానికి తగ్గ పలితం ఉంటుందని ప్రొడక్షన్ టీం భావిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ పరంగా గుర్తింపు రావడం వల్ల ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు ఉండకూడదని ఈ చిత్ర నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రం లో నాని, సమంతా, సుదీప్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మరియు ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈగ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ బాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు