విడుదల కు రెండు నెలలు ఉండగానే “ఈగ” చిత్రంకి కన్నడ పరిశ్రమ లో ఆసక్తికరమయిన సంఘటన చోటు చేసుకుంది. నాని సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం లో సుదీప్ ప్రతినాయిక పాత్రలో నటిస్తున్నారు. సుదీప్ కి కన్నడ పరిశ్రమ లో ఉన్న ప్రాచుర్యం రిత్యా ఈగ చిత్ర హక్కులు అక్కడ భారీగా ఉండబోతుంది. అక్కడి వర్గాల సమాచారం ప్రకారం ఈగ చిత్రాన్ని కన్నడ ప్రాంతం మొత్తం కి గాను 2.5 కోట్లకు అడిగారు కాని నిర్మాతలు ఇంకా ఎక్కువగా వస్తుందని వేచి చూస్తున్నారు. ఈగ చిత్రం కన్నడ డబ్బింగ్ కూడా కావట్లేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఈగ చిత్రం ఒక నేరుగా వచ్చిన కన్నడ చిత్రంలా లాభం పొందుతుంది. ఈ చిత్రానికి రాజమౌళి కథ మరియు దర్శకత్వం అందించారు. ఒక సాధారణ యువకుడు మరు జన్మ లో ఈగలా పుట్టి పూర్వ జన్మ లో ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది చిత్ర కథ. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.