ఈ రోజుల్లో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట శ్రీనివాస్ మరియు రేష్మ. ఈ జంట మళ్లీ ఒక కొత్త చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి సపన్ దర్శకత్వం వహిస్తున్నారు, కాళి క్రియేషన్స్ బ్యానర్ ఫై రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియో లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ ” ఈ రోజుల్లో చిత్రం విడుదల అయ్యే రోజు సపన్ కథ చెప్పాడని, ఆ రోజు సాయంత్రానికి ఈ చిత్రాన్ని ఖరారు చేశానని చెప్పారు “. జూన్ 7 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అలాగే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చిత్ర యూనిట్ తెలియజేసారు. అగస్త్య ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.