అర్ధ శతదినోత్సవం జరుపుకుంటున్న “ఈ రోజుల్లో”

అర్ధ శతదినోత్సవం జరుపుకుంటున్న “ఈ రోజుల్లో”

Published on May 9, 2012 3:12 PM IST


ఈ సంవత్సరం చిన్న బడ్జెట్ చిత్రంగా విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం “ఈ రోజుల్లో”. ఈరోజు మొత్తం 53 సెంటర్లలో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటుంది. యువత మరియు విద్యార్థులు ఈ చిత్రాన్ని చాల బాగా ఆదరించారు ఈ చిత్ర విజయానికి ఇదే కారణం. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారుశ్రీనివాస్ మరియు రేష్మలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ నిర్మించారు. జే బి ఈ చిత్రానికి సంగీతం అందించారు. కెనాన్ 5 డి కెమరా తో చిత్రీకరించిన ఈ చిత్రం తెర్ర మీద చూడటానికి చాలా బాగుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు