దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ ఎన్టీఆర్, చరణ్ లతో మూడు సినిమాలు

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ ఎన్టీఆర్, చరణ్ లతో మూడు సినిమాలు

Published on May 7, 2012 4:46 PM IST


ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మ్మోడు సినిమాలు చేయబోతున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఈ సంస్థ దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. వారి బ్యానర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురితో మూడు సినిమాలు చేయబోతున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా, రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఇంకా దర్శకుడు ఎవరు అన్నదీ ధ్రువీకరించలేదని చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు