దుల్కర్ నిజంగానే ‘లక్కీ’.. రెండు కళాఖండాలు మిస్!

దుల్కర్ నిజంగానే ‘లక్కీ’.. రెండు కళాఖండాలు మిస్!

Published on Jun 7, 2025 2:00 AM IST

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ హీరో ఓ రెండు భారీ డిజాస్టర్ చిత్రాల నుంచి తప్పించుకున్నాడు.

ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లో కూడా హీరో కమల్ హాసన్ కావడం. ఆయన నటించిన ‘ఇండియన్-2’ సినిమాలో సిద్ధార్థ్ చేసిన పాత్రకు తొలుత దుల్కర్‌ను తీసుకున్నారు. కానీ, ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సిద్ధార్థ్ నటించాడు. ఇక ఆ సినిమా ఎలాంటి కళాఖండంగా నిలిచిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు కమల్ నటించిన మరో సినిమా ‘థగ్ లైఫ్’లోనూ శింబు చేసిన పాత్ర కోసం దుల్కర్‌ను సంప్రదించారట. కానీ, ఆయన ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట. ఇక ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వస్తుండడంతో ఇది కూడా మరో ‘ఇండియన్-2’ మూవీగా అవతరించనుందని విమర్శకులు అంటున్నారు. దీంతో దుల్కర్ ఈ రెండు కళాఖండాల నుంచి తప్పించుకోవడంతో అతడిని నిజంగానే లక్కీ అని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు