తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ మంచి అంచనాల మధ్య థియేటర్లలో నిన్న(అక్టోబర్ 17) గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలోని కంటెంట్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉన్నా, డ్యూడ్ దూసుకెళ్తున్నాడు.
ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా డే1 వసూళ్లతో దుమ్ములేపింది. డ్యూడ్ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.22 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మిగతా సినిమాలు కాస్త వెనకబడటంతో ఈ వీకెండ్, పండుగ సెలవు ‘డ్యూడ్’కు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమాకు మరింత సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.