ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘డ్యూడ్’ దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఈ చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.95 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా స్టడీ కలెక్షన్స్‌తో రన్ అవుతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.