పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని పూర్తి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించిన తీరు అభిమానులను మెప్పించింది. ఇక పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పక్కా మాస్ అవతారంలో కనిపించి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు.
అయితే, ఈ సినిమాపై తాజాగా కన్నడ దర్శకుడు ఆర్.చంద్రు ఓ ఇంటర్వ్యూలో కొన్ని వైరల్ కామెంట్స్ చేశాడు. తాను 2023లో రూపొందించిన ‘కబ్జా’ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని ‘ఓజీ’ని రూపొందించారని ఆయన ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయన తీసిన ‘కబ్జా’ ఒక యావరేజ్ చిత్రం. అలాంటి చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని ఓజీ తెరకెక్కిందని చెప్పడం నిజంగా మూర్ఖత్వం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓజీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిన వేళ ఇలా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.