మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ తన పాత్రతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా చేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలో రవితేజ, నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో ‘మాస్ జాతర’ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌తో పాటు కామన్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి సందేహాలు వద్దని.. ఈ మూవీ ప్రీమియర్స్ కూడా అనుకున్న సమయానికి వేస్తామని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
దీంతో మాస్ జాతర ప్రీమియర్స్ ఖాయమని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా అక్టోబర్ 31న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తు్న్నారు.