మహేష్ సినిమా కోసం స్టైల్ మార్చిన దేవీ శ్రీ

మహేష్ సినిమా కోసం స్టైల్ మార్చిన దేవీ శ్రీ

Published on Sep 4, 2012 12:06 PM IST


టాలీవుడ్లో ఉన్న యంగ్ మరియు ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పటికే 2012లో బ్లాక్ బస్టర్ అయిన ‘గబ్బర్ సింగ్’ మరియు జులాయి’ చిత్రాలను దేవీ శ్రీ తన ఖాతాలో వేసుకున్నారు. మొట్ట మొదటి సారిగా దేవీ శ్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర మ్యూజిక్ గురించి దేవీ శ్రీ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. ‘ మహేష్ బాబు – సుకుమార్ సినిమాకి చాలా పూర్తి వైవిధ్యమైన మ్యూజిక్ ఇస్తున్నాను. ఇది కొత్త రకమైన మరియు ప్రత్యేకమైన ఆల్బమ్ అవుతుంది, అలాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని భావిస్తున్నానని’ దేవీ శ్రీ ట్వీట్ చేసారు.

సుకుమార్ – దేవీ శ్రీ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వీరి కాంబినేషన్ కి మహేష్ బాబు తోడవడంతో ఈ చిత్ర ఆడియో పై బాగా అంచనాలున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని మహేష్ తో ‘దూకుడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

తాజా వార్తలు