స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ వంటి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. గత కొద్ది రోజులుగా అయన నటుడిగా మారనున్నాడు అని పుకార్లు ఉన్నాయి ప్రస్తుతం ఇంటర్నెట్లో మరో పుకారు మొదలయ్యింది దేవిశ్రీ ప్రసాద్ కి శ్రియ తో కలిసి నటించాలని కోరిక ఉందని అయన చెప్పినట్టు పుకారు వినిపిస్తుంది ఒకానొక ఇంటర్వ్యూ లో దేవిశ్రీ ప్రసాద్ తను నటుడిగా మారితే శ్రియతోనే నటిస్తాను అని చెప్పినట్టు సమాచారం. దేవిశ్రీ మరియు శ్రియ మంచి స్నేహితులు, శ్రియ నటించిన పలు చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఇప్పుడు శ్రియ ఈ కామెంట్లకి ఎలా స్పందిస్తారో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో ఉండగా శ్రియ రూప అయ్యర్ ద్విభాషా చిత్రంలో ఈ మధ్య తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు.