స్వరాలతో సందడి చెయ్యనున్న దేవి శ్రీప్రసాద్

స్వరాలతో సందడి చెయ్యనున్న దేవి శ్రీప్రసాద్

Published on Dec 5, 2013 12:03 AM IST

devi-sri-prasad
దేవి శ్రీప్రసాద్ కు తెలుగు తమిళ భాషలలో లెక్కకు మించిన అభిమానులు వున్నారు. ఈ యేడాది అతను ‘మిర్చి’, ‘ఇద్ధరమ్మాయిలతొ’, మరియు పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ రూపంలో చార్ట్ బస్టర్లను మనకు అందించాడు. ఇప్పుడు ఈ మ్యూజిక్ మెజీషియన్ మహేష్ బాబు ‘1’కు మరియు అజిత్ ‘వీరం’ సినిమాలకు స్వరాలను అందిస్తున్నాడు

‘1’ సినిమాకు తొలిసారిగా మహేష్ కు దేవి సంగీతం అందిస్తున్నాడు. కాబట్టి దేవి తనలో బెస్ట్ ను ఈ సినిమాకు అందించాడని సమాచారం. విడుదలైన వెంటనే ఆడియో తప్పక హిట్ అవుతుంది అన్న నమ్మకంతో వున్నాడు. మరోపక్క అజిత్ ‘వీరం’ మాస్ ఎంటర్టైనర్ కనుక రెండు వేర్వేరు పనిచెయ్యడంపై ఆనందం వ్యక్తం చేసాడు

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాఆడియో ఈ నెల 19న విడుదలకానుంది. అనీల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా విడుదలచెయ్యనున్నారు

తాజా వార్తలు