నాని లిస్ట్ లో హిట్ డైరెక్టర్ ఉన్నాడా ?

నాని లిస్ట్ లో హిట్ డైరెక్టర్ ఉన్నాడా ?

Published on Apr 15, 2020 3:00 AM IST

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమా డీసెంట్ రివ్యూస్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ తో మంచి హిట్ అనిపించుకుంది. శైలేష్ కొలను అయితే నెక్స్ట్ ‘హిట్ 2’ తీస్తానని అంటూనే అవకాశం వస్తే నానిని కూడా డైరెక్ట్ చేస్తానని మనసులో మాటను ఇప్పటికే బయటపెట్టాడు,

ఎలాగూ మంచి కథతో వస్తే కొత్తవారైనా సరే కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు నాని. అలాంటిది తన నిర్మాణంలోనే దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న, తనతో సినిమా చేయాలని ఆశపడుతున్న శైలేష్ కొలనుకు నాని సినిమా ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నానికి శైలేష్ ఒక లైన్ చెప్పారని.. ఫుల్ స్క్రిప్ట్ చేసుకొని రమ్మని నాని, శైలేష్ కి చెప్పినట్లు తెలుస్తోంది. శైలేష్ స్క్రిప్ట్ నానికి నచ్చితే శైలేష్ కొలనుకు నాని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని.. నాని లిస్ట్ లో ఈ డైరెక్టర్ పేరు కూడా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

పైగా హిట్ సినిమాని చక్కగా రూపొందించి శైలేష్ కొలను ప్రేక్షకుల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. నాని సైతం శైలేష్ తన నమ్మకాన్ని నిలబెట్టింనందుకు సంతృప్తిగా ఉందని మీడియా సమక్షంలోనే చెప్పారు. మరి నాని శైలేష్ కు ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు