పూరి భామలకు మార్కెట్ లో ప్రత్యేకమైన క్రేజ్. ఆసిన్ నుండి ఇలియానా వరకూ ఒక ఊపు ఊపేశారు. ఇప్పుడు ఆదే స్కూల్ నుండి ఆదా శర్మ నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయంకానుంది. విశేషమేమిటంటే ఈ యేడాది ఆమె బాలీవుడ్ లో కూడా తెరారంగ్రేటం చేయనుంది
హార్ట్ ఎటాక్ చిత్రమేకాక ఆమె వినీల్ మాథ్యూ తీస్తున్న ‘హాసీ తో ఫాసీ’ అనే హిందీ సినిమాలో ముఖ్యపాత్రపోషించనుంది. సిద్ధర్ధ్ మల్హోత్రా, పరినీతి చోప్రా హీరో హీరోయిన్స్. ఈ సినిమాను కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించడంతో ఒక్క సారిగా వార్తలలో నిలిచింది. ఈ చిత్రం హార్ట్ ఎటాక్ విడుదలైన వారం తరువాత ఫిబ్రవరి 7న విడుదలకానుంది
ప్రస్తుతం ఈ భామ్ హార్ట్ ఎటాక్ ప్రచారంలో బిజీగా వుంది. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. పూరి జగన్ దర్శకనిర్మాత