భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న దూసుకెళ్తా

Doosukeltha-(2)

మంచు విష్ణు హీరోగా నటించిన ‘దూసుకెళ్తా’ మూవీ రేపు భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 900 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో సబ్ టైటిల్స్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో మంచు విష్ణు – లావణ్య త్రిపతి జంగా నటించారు. వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీత అందించాడు. బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని నవ్వించనున్నారు. విష్ణు చివరిగా నటించిన ‘దేనికైనా రెడీ’ తో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకొని బాక్స్ ఆఫీసు వద్ద తన స్థానాన్ని సుస్థిర పరచుకోవాలని చూస్తున్నాడు.

Exit mobile version