విష్ణు మంచు నటించిన ‘దూసుకెళ్తా’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనుండి ఆదరించబడుతుంది. ఈ సినిమాలో వున్న కామెడీ వలన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర కుదురుకుంటుంది
ఈవారంలో మరే ఇతర చిత్రాలు విడుదలకాకపోవడం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ సినిమా బృందమంతా ఆనందంతో పడ్డ కస్తాన్ని మర్చిపోయారు. ముఖ్యంగా దర్శకుడు వీరూ పోట్ల, మంచు వారి ఫ్యామిలీ తమ తమ ఆనందాలని ట్విట్టర్ లో పంచుకున్నారు.
లావణ్య త్రిపాటి ఈ సినిమాలో హీరోయిన్. మణిశర్మ సంగీతాన్ని అందించాడు, 24 ఫ్రేమ్స్ మూవీస్ బ్యానర్ పై విష్ణు ఈ సినిమాని నిర్మించాడు