రిలీజ్ కి ముందే మంచి రిపోర్ట్స్ తెచ్చుకున్న దూసుకెళ్తా

doosukeltha
మంచు విష్ణు హీరోగా నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘దూసుకెళ్తా’. ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి రిపోర్ట్ ని సంపాదించుకుంది. సినిమాలో మంచి కామెడీతో పాటు హై రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ‘బిందాస్’, ‘రగడ’ లాంటి మాస్ కామెడీ ఎంటర్టైనర్స్ తీసిన వీరూ పోట్ల ఈ మూవీకి డైరెక్టర్.

ఈ మూవీలో అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపతి హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే లావణ్య ఈ మూవీ లో గ్లామరస్ అవతారంలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని నవ్విన్చానున్నారు. విష్ణు ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మించాడు.

Exit mobile version