ఇది మీకు తెలుసా? ఆ హాలీవుడ్ సినిమా లేకపోతే ‘శివ’ లేదా?


ఒక్క మన తెలుగు సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఒక సినిమాని ఇలా కూడా తీసి సెన్సేషన్ ని సెట్ చేయొచ్చు అని చూపించిన సినిమానే “శివ”. అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ భారీ హిట్ సినిమా ఇన్నాళ్ళకి మళ్ళీ సరైన 4కే అప్ గ్రేడ్ అయ్యిన సినిమాగా రీరిలీజ్ కి వస్తుంది.

మరి ఈ రీరిలీజ్ కోసం మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. ఇక ఇలాంటి ఓ సినిమా వెనుక ఓ ఇంట్రెస్టింగ్ మిస్టరీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా చెప్పడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఇండియన్ సినిమా దగ్గర పాత్ బ్రేకింగ్ సినిమాగా నిలిచిన ఈ సినిమా తీయడానికి తనకి ప్రేరణ ఓ హాలీవుడ్ సినిమా అని తాను రివీల్ చేశారు.

లెజెండరీ నటుడు అలాగే మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ బ్రూస్ లీ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఓ పది పదిహేను సార్లు చూసి దానిలో మార్షల్ ఆర్ట్స్, హోటల్ బ్యాక్ డ్రాప్ ప్లేస్ లో కాలేజ్ పెట్టి తీసేసానని రివీల్ చేశారు. దీనితో ఆ సినిమా ప్రేరణే ఈ శివ అని చెప్పాలి. మరి ఆ సినిమా లేకపోయి ఉంటే శివ లాంటి ఐకానిక్ సినిమా వచ్చి ఉండేది కాదేమో మరి. ఇక ఈ చిత్రం ఈ నవంబర్ 14న థియేటర్స్ లో రాబోతుంది.

Exit mobile version