ప్రభాస్ డైరెక్టర్ ఈ సారి గట్టిగా కొడతాడట..!

ప్రభాస్ డైరెక్టర్ ఈ సారి గట్టిగా కొడతాడట..!

Published on May 3, 2020 1:08 PM IST

యంగ్ డైరెక్టర్ సుజీత్ పేరు గత ఏడాది దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఆయనకు సాహో సినిమా తెరకెక్కించే అవకాశం రావడంతో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. దానికి కారణం సాహో సుజీత్ కి కేవలం రెండో సినిమానే. ఐతే సాహో విడుదల తరువాత ఆయన ప్రశంసల కంటే విమర్శలనే ఎక్కువగా ఎదుర్కొన్నాడు. హిందీలో పాజిటివ్ టాక్ తో హిట్ మూవీగా నిలిచిన ఈ చిత్రం సౌత్ లో మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

కారణం ఏమిటో తెలియదు సాహో విజయం సాధించక పోయినా చిరంజీవి పిలిచి మరి ఆయనకు ఆఫర్ ఇచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటిస్తుండగా ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు సుజీత్ కి అప్పగించాడు చిరు. దీనితో చిరు నమ్మకం నిలబెట్టాలనే తపనతో పాటు, ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో సుజీత్ ఈ స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడట. ఈసారి సత్తా చాటి తానేమిటో చూపిస్తాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు