ఆ స్టార్ డైరెక్టర్ తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో లేదా అల్లు అర్జున్‌తో

ఆ స్టార్ డైరెక్టర్ తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో లేదా అల్లు అర్జున్‌తో

Published on Oct 13, 2020 9:05 PM IST

తమిళ స్టార్ డైరెక్టర్లు తెలుగు స్టార్ హీరోలతో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలాంటి దర్శకుల్లో శివ కూడ ఒకరు. నిజానికి శివ దర్శకుడిగా పరిచయమైంది తెలుగు సినిమాలతోనే. ‘శౌర్యం, శంఖం’ సినిమాలు చేశాక తమిళంలోకి వెళ్లిన శివ ‘వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం’ అంటూ అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్లు సొంతం చేసుకుని స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్తే’ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆ చిత్రం పూర్తవుతుంది.

అది పూర్తికాగానే తెలుగులో ఒక సినిమా చేయాలని శివ ప్లాన్ చేసుకున్నారు. ఆయన చిత్రం ఎన్టీఆర్‌తో లేదా అల్లు అర్జున్‌తో ఉండనుంది. మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది అప్పటికి శివ చెప్పే కథ నచ్చడం, ఆ సమయానికి హీరోల డేట్స్ వంటి అంశాల మీద ఆధారపడనుంది. సినిమా ఎవరితో అయినా హెవీ యాక్షన్ ఎంటర్టైనర్‌గానే ఉంటుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తుండగా తర్వాతి సినిమా ఎవరితో అనేది ఇంకా ఫైనల్ చేసుకోలేదు. అలాగే బన్నీ ప్రజెంట్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చేస్తున్నారు. ఆయన కూడ తర్వాత ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు