ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అఫీషియల్ గా జాయినయిన దర్శకుడు శంకర్

ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అఫీషియల్ గా జాయినయిన దర్శకుడు శంకర్

Published on Nov 1, 2013 9:00 PM IST

Shankar
ప్రస్తుతతరం దర్శకులలో విలక్షణ సినిమాలు తీయడమే కాక వాటిని వైవిధ్యంగా తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. భారీ బడ్జెట్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకుని చాలా హిట్లను సంపాదించాడు. చివరిగా శంకర్ రజినితో ‘రోబో’ సినిమా తీసాడు.

ప్రస్తుతం శంకర్ విక్రమ్ తో ‘ఐ’ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో మనోహరుడు గా తెరకెక్కుతుంది. విశేషం ఏమిటంటే ఇప్పటివరకూ www.directorshankaronline.com ద్వారా సినిమా సమాచారాన్ని అందించిన శంకర్ ఈరోజు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో జాయిన్ అయ్యాడు. ట్విట్టర్ లో @shankarshanmugh ఫేస్ బుక్ లో www.facebook.com/shankarofficial ద్వారా శంకర్ ను ఫాలో అవ్వచ్చు

ప్రస్తుతం విక్రమ్ తో తీస్తున్న సినిమా షూటింగ్ పుర్తికావచ్చింది. అమి జాక్సన్ హీరోయిన్. ఏ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా వచ్చే యేడు విడుదలకానుంది

తాజా వార్తలు