పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..!

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. పేట్రియాటిక్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ మూవీపై పూరి ఎప్పటినుండో కసరత్తు చేస్తున్నారు. అప్పట్లో మహేష్ హీరోగా దాదాపు మూవీ ఖాయం అని వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు పూరి ఫార్మ్ లో లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మరుగున పడింది. తాజాగా ఈ మూవీ గురించి పూరి జగన్నాధ్ స్పందించారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. జనగణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న పూరి..త్వరలోనే ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తాను అన్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చిత్రం తరువాత బహుశా పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని చేస్తారేమో అనిపిస్తుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు చేయనున్నారు అనేది తెలియాల్సివుంది. ఇక విజయ్ దేవరకొండతో ఆయన చేస్తున్న మూవీ కొంత చిత్రీకణ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో విజయ్ ఫైటర్ రోల్ చేస్తుండగా..ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా..మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version